రామగుండంలో ప్రారంభమైన బాలికల సాధికారత మిషన్

PDPL: రామగుండం ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో బాలికల సాధికారత మిషన్ వర్క్ షాప్‌ని ఈడీ చందన్ కుమార్ సమంత ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులను ఎంపిక చేసి నెల రోజులపాటు వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వనున్న ట్టు పేర్కొన్నారు. విద్యుత్‌తో పాటు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఎన్‌టీపీసీ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.