పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రశంసలు

పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రశంసలు

బాపట్ల: జిల్లా పోలీస్ శాఖకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందనలు తెలిపారు. ఇంకొల్లు పట్టణానికి చెందిన జాగర్లమూడి శివ ప్రసాద్ తండ్రి హరిబాబు ఇంట్లో జరిగిన చోరీ కేసును 24 గంటల్లోనే పరిష్కరించి అద్భుత పని తీరు కనబరిచారన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3న అర్ధరాత్రి సమయంలో రూ.75 లక్షల చోరీ జరిగిందన్నారు.