'7న కళ్యాణదుర్గానికి మంత్రి లోకేశ్'
ATP: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 7న కళ్యాణదుర్గానికి రానున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 7వ తేదీన కార్యకర్తలను లోకేశ్ చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. 8న పట్టణంలో నూతనంగా నిర్మించిన కనకదాసు విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.