'గండికోటను కాపాడుకోవడం మన బాధ్యత'

KDP: గండికోట పర్యాటక కేంద్రం మన భౌగోళిక వారసత్వ సంపద అని కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు పేర్కొన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆయన అన్నారు. గురువారం గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులో "ఏపీలో భౌగోళిక కార్యకలాపాలు" అనే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.