రేపు దేవరకొండ మున్సిపాలిటీలో వార్డు సభలు
NLG: "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక"లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా దేవరకొండలో గురువారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ అధ్యక్షతన 20వ వార్డులో వార్డు సభ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ తెలిపారు. అనంతరం 1వ వార్డు నుంచి 19వ వార్డులలో 10 గంటలకు వార్డు కౌన్సిలర్‌ల అధ్యక్షతన వార్డు సభలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.