నరసరావుపేటలో కలుషిత త్రాగునీరు.. ఆందోళన

నరసరావుపేటలో కలుషిత త్రాగునీరు.. ఆందోళన

పల్నాడు: నరసరావుపేటలో తాగునీటి సరఫరా అధ్వానంగా తయారైందని, 10 రోజులుగా కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా పచ్చటి రంగులో, పాచి వాసనతో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నీటిని తాగితే రోగాల బారిన పడతామని, అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.