ధర్మసాగరం గ్రామంలో రైతన్న మీకోసం

ధర్మసాగరం గ్రామంలో రైతన్న మీకోసం

AKP : నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో సిబ్బంది, రైతుల ఇంటికి వెళ్లి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రైతులు కోసం వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సూచించారు.