ఉత్తమ క్షేత్ర సహాయకులకు నగదు బహుమతి

ఉత్తమ క్షేత్ర సహాయకులకు నగదు బహుమతి

KMR: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా అత్యధిక కూలీల హాజరు నమోదు చేసిన ముగ్గురు క్షేత్ర సహాయకులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సత్కరించారు. ఇవాళ లింగంపల్లి అంజయ్య, రాములు, తిప్పాపూర్ నరేశ్‌ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు పిలిపించి, ఒక్కొక్కరికి రూ.1,000 బహుమతి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.