రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులు
NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14, 17 హ్యాండ్ బాల్, నెట్ బాల్ క్రీడల్లో 4 గురు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు సుజాత తెలిపారు. విద్యార్థులను అభినందించారు. అనంతరం పీఈటీ ఉపాధ్యాయురాలు ప్రవీణ విద్యార్థులకు క్రీడా దుస్తులను ఎంఈవో రత్నం చేతుల మీదుగా పంపిణీ చేశారు.