నంగునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SDPT: నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ దేవులపల్లి యాదగిరి, సర్పంచ్ బాల పోచయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా0 కేంద్రంలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.