VIDEO: కాంట్రాక్టర్ మార్పుతో నిరసన సేగలు
HNK: కాజీపేట పట్టణంలో ఎన్‌ఐటీ కళాశాలలో కాంట్రాక్టర్ మార్పుతో కార్మికులు ఇవాళ నిరసనలు చేశారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మందికి రూ.19 లక్షల బకాయిలు చెల్లించాలన్నారు. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటాననడంతో 40 మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.