బాన్సువాడ డీఎస్పీగా విట్టల్ రెడ్డి

బాన్సువాడ డీఎస్పీగా విట్టల్ రెడ్డి

నిజామాబాద్: బాన్సువాడ డీఎస్పీగా విట్టల్ రెడ్డి శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల డీఎస్పీ సత్యనారాయణ బదిలీపై వెళ్లగా వారి స్థానంలో విట్టల్ రెడ్డి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. పోలీస్ సిబ్బంది డీఎస్పీ విట్టల్ రెడ్డికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.