రేణిగుంటలో 20 ఎర్రచందనం దుంగలు పట్టివేత

TPT: ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పంజా విసిరారు. రేణిగుంట మండలం కరకంబాడి - మామండూరు రోడ్డులో ఆంజనేయపురం వద్ద వాహన తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఈ మేరకు రెండు కార్లు స్వాధీనం చేసుకుని, కర్ణాటకకు చెందిన ఒక స్మగ్లరును అరెస్టు చేశారు. కాగా, మరో వ్యక్తి పరారయ్యాడు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.