డీజేలకు అనుమతి లేదు : ఎస్పీ

SRCL: గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో, శోభాయాత్ర రోజున డీజేలకు అనుమతి లేదని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే స్పష్టం చేశారు. శనివారం సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమర్జనం రోజున ఉపయోగిస్తే డీజే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.