ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు
W.G: కలెక్టర్ ఆదేశాల మేరకు, లైన్ డిపార్ట్‌మెంట్ల సమన్వయంతో జిల్లా జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యాధులు వ్యాప్తించకుండా, సురక్షితమైన వాతావరణం కల్పించడం లక్ష్యం.