చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు
NZB: దోమకొండలోని చాముండేశ్వరి దేవి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం అమ్మవారికి ప్రత్యేక హారతి, పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించామని ప్రధాన అర్చకుడు శరత్ చంద్ర శర్మ తెలిపారు. నెల రోజుల పాటు కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవాలు, రుద్రాభిషేకాలు, సహస్ర నామార్చనాలు, వనభోజనాలు నిర్వహించినట్లు వెల్లడించారు.