రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వినతిపత్రం

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వినతిపత్రం

MDCL: శామీర్‌పేట్‌లోని రాజీవ్ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులను కోరారు. నల్సార్, ఆరెంజాబౌల్ చౌరస్తాలవద్ద అతివేగంతో వాహనాలు రావడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రెండుచౌరస్తాల వద్ద సిగ్నల్స్, రేడియంతో కూడిన స్పీడ్ బేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు.