విద్యార్థుని ఆపరేషన్‌కు పాఠశాల ఛైర్మన్ ఆర్థిక సహాయం
MBNR: కోయిల్ కొండ మండలంలోని రామన్న పల్లి తండా గ్రామానికి చెందిన కె.శివ కుమార్ అనే బాలుడు తలసేమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అతని పాఠశాల ఛైర్మన్ శ్రీమతి చెన్నమ్మ రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.