పాడైపోయిన మటన్ విక్రయం.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

పాడైపోయిన మటన్ విక్రయం.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

HYD: నగరంలో కల్తీ దందా పెరుగుతుంది. అపరిశుభ్ర వాతావరణంలో, పాడైపోయిన మటన్‌ను అమ్ముతున్న ఓ దుకాణంపై గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గోషామహల్‌లో ఓ వ్యక్తి యూపీ నుంచి తీసుకుని వచ్చి మేక, గొర్రె తలలను కాళ్ళను నిల్వ ఉంచి పాడైపోయిన మటన్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఏమాత్రం నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.