యువత మేలుకో-డ్రగ్స్ మానుకో అవగాహన కార్యక్రమం
జనగాం: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా స్టేషన్ ఘనపూర్ పట్టణంలో మా గార్డెన్‌లో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో “యువత మేలుకో-డ్రగ్స్ మానుకో” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ హాజరై యువతకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, వాటి ప్రభావం గురించి వివరించారు.