శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు

NDL: ద్వాదశ జ్యోతిలింగం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈవో శ్రీనివాసరావు దసరా మహోత్సవాల ఏర్పాట్లపై శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని అన్ని విభాగాల పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.