ఏలూరును నాటుసారా రహిత జిల్లాగా చేయాలి: కలెక్టర్

ఏలూరును నాటుసారా రహిత జిల్లాగా చేయాలి: కలెక్టర్

ELR: ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అధికారులతో బుధవారం సమీక్షించారు. సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. నాటు సారా జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.