బండాయప్ప పుణ్యతిథి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

బండాయప్ప పుణ్యతిథి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం రాత్రి బండయప్ప స్వామి పుణ్య తిథి పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మఠాధిపతి సోమ లింగా శివాచార్య స్వామి ఆధ్వర్యంలో శివలింగం, బండయప్ప స్వామి విగ్రహానికి అభిషేకాలు, రుద్ర అభిషేకం చేశారు. ఎమ్మెల్యేకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.