'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్'

మన్యం: ప్రజలు విన్నవించే ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్‌ను నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజలు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అధికారులు త్వరగా పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.