VIDEO: పెద్ద హరివణం వద్దే వద్దు.. ఆదోని ముద్దు'
KRNL: పెద్ద హరివణం మండలంలో మదిరే గ్రామాన్ని కలపడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆదోని పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న తమ గ్రామాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివణంలో కలపడం సమంజసం కాదన్నారు. 'పెద్ద హరివణం వద్దే వద్దు.. ఆదోని ముద్దు' అంటూ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని నినాదాలు చేపట్టారు.