నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కోనసీమ: రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. పొన్నమండ 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు నిర్వహించనున్న నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని EE రాంబాబు తెలిపారు. పొన్నమండ, చింతలపల్లి, కాట్రేనిపాడు, మెరకపాలెం, కూనవరం తదితర గ్రామాలకు ఉండదన్నారు.