ఈతకు వెళ్లి అక్కాతమ్ముళ్లు మృతి
SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుక్కల రిషిక (13), కుక్కల మనీష్ (12) అనే అక్కాతమ్ముళ్ల ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఆదివారం సెలవు దినం కావడంతో వారు గ్రామ సమీపంలోని మల్లన్న సాగర్ కెనాల్ వద్దకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో నీటి లోతును గమనించక పోవడంతో ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు.