కార్యకర్తలను సన్మానించడం నా అదృష్టం: ఎమ్మెల్యే

కార్యకర్తలను సన్మానించడం నా అదృష్టం: ఎమ్మెల్యే

ATP: గుంతకల్లులో ఆదివారం టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టిడిపి సీనియర్ నాయకులను ఎమ్మెల్యే సత్కరించి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నన్నారు.