ఎంపీడీవోపై వైసీపీ నేత దాడి
AP: సత్యసాయి జిల్లా రొళ్ల ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఆయనపై వైసీపీ మాజీ ఎంపీపీ భర్త విజయరంగేగౌడ్ పిడిగుద్దులు గుద్దారు. బిల్లుల మంజూరు విషయంలో ఎంపీడీవోతో విజయరంగేగౌడ్ ఘర్షణ పడ్డాడు. అనంతరం ఎంపీడీవోని దుర్భాషలాడుతూ.. దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో ఇరువురు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.