'జిల్లా అభివృద్ధికి బ్యాంకులు తోడ్పాటునందించాలి'

JN: ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకులు తోడ్పాటునందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం బ్యాంకర్లతో (డీసీసీ/డీఎల్ఆర్సీ) జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.