'అల్లూరులో స్మార్ట్ కార్డులు పంపిణీ'
NDL: నందికోట్కూరు మండలం అల్లూరులో పాత రేషన్ కార్డు స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సోమవారం పంపిణీ చేశారు. ప్రజలు స్మార్ట్ కార్డు తీసుకొని రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకోవాలని, రేషన్ వల్ల సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.