ఏఐ చెప్పే ప్రతీది నమ్మొద్దు: సుందర్ పిచాయ్
ఏఐపై గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని స్పష్టం చేశారు. దానికి గూగుల్ కూడా అతీతం కాదన్నారు. కానీ దాన్ని గూగుల్ తట్టుకోగలదని చెప్పారు. అదే సమయంలో ఏఐ చెప్పే ప్రతీది నమ్మొద్దని సూచించారు. ఏఐ మోడళ్లు కూడా ఎర్రర్స్‌కు లోనయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.