తేలప్రోలులో నేడు ఆధార్ శిబిరం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆధార్ సేవల కోసం శనివారం శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్, సెక్రటరీ తెలిపారు. ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో బయోమెట్రిక్ అప్‌డేట్లు, ఫోన్ నంబర్ మార్పులు, ఇతర సమాచార సవరణలు చేసుకోవచ్చన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోపు వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.