రేపు కడపలో చంద్రబాబు పర్యటన

రేపు కడపలో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి ఆయన వెళ్లనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పెండ్లిమర్రికి చేరుకుని వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల సెంటర్‌ను పరిశీలించనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు.