అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
KNR: అగ్ని ప్రమాదాల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హుజురాబాద్ శివారులోని ఎక్స్ ప్లోజివ్స్ గోదాం వద్ద ఫైర్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోదాంలో అగ్నిమాపక సాధనాలు ఎల్లప్పుడూ పనిచేసే విధంగా ఉంచాలన్నారు. వేసవిలో మండే స్వభావం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.