పోలీసుల వీక్లీ పరేడ్

పోలీసుల వీక్లీ పరేడ్

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం పోలీసు సిబ్బంది వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ పర్యవేక్షణలో ఈ కవాతు నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందికి మానసికం, శారీరక శ్రమ చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రతి సిబ్బందిలో క్రమ శిక్షణ కోసం వీక్లీ పరేడ్ నిర్వహిస్తున్నామన్నారు.