మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం

IPL: ముంబై, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గుజరాత్ 18 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 132 పరుగుల వద్ద నిలిచింది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.