కాళేశ్వరంలో భక్తుల రద్దీ
BHPL: మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని కాలేశ్వర ముక్తేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళా భక్తులు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.