'విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి'

'విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి'

SKLM: పాతపట్నంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 7వ తరగతి చదువుతున్న పూజ అనే విద్యార్థిని మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటనపై దళిత సంఘాల జెఎసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూజ మృతి ఘటనపై నిష్పక్షపాత సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.15 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.