BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో MLA కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టారు. సిరసనపల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 48 గంటల పాటు దీక్ష చేయనున్నారు. డంపింగ్ యార్డుకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, కాంగ్రెస్, BJP కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదని, డంపింగ్ యార్డుతో 2.50 లక్షల మందిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.