రేపు షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక

అన్నమయ్య: మదనపల్లె మండలంలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. పుంగనూరు రోడ్డులోని గ్రీన్ వ్యాలీ పాఠశాల మైదానంలో ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని కోరారు.