'ప్రైవేటు సంస్థల విత్తనాలను కొనవద్దు'
NZB: అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి రైతులకు సూచించారు. ఆర్మూర్, నందిపేట మండల్లాల్లోని మంథని, కుద్వాన్పూర్ గ్రామాలలో రైతులతో ఆయన శనివారం సమావేశాలు నిర్వహించారు. ఈ యాసంగి సీజన్‌లో విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు వాడాలని రైతులకు సూచించారు.