లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి

అన్నమయ్య: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని తంబళ్లపల్లె జేసీజే కోర్టు న్యాయాధికారి ఉమర్ ఫరూక్ పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం కోర్టులో సీఐ వెంకటేశులు, APP, తంబళ్లపల్లె, ములకలచెరువు, PTM, పెద్దమండ్యం మండలాల ఎస్సైలు, ఎక్సైజ్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13న కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.