గిరిజనులకు సీతా'ఫలాలు' అందేనా..?

గిరిజనులకు సీతా'ఫలాలు' అందేనా..?

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా ప్రాంతం మూలబిన్నిడి గ్రామంలో సీతాఫలాలను గిరిజనులు బుధవారం అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో ఎంతో శ్రమపడి వీటిని సేకరించి దిగువ ప్రాంతానికి తీసుకువస్తామని, అయితే ఆశించిన ధర లేక దళారులకే విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రమే సహజ సిద్ధమైన సీతాఫలాలు దొరుకుతాయని తెలిపారు.