రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ

KKD: కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 మంది రౌడీషీటర్లను పోలీసులు శనివారం పీఎస్‌కు పిలిపించారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అసాంఘిక ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అనంతరం వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు ఎస్సై సతీశ్ వెల్లడించారు.