రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

CTR: పెద్దపంజాణి మండలం రాయల్‌పేటలో రోడ్డు విస్తరణ మార్కింగ్ పనులను ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఇటీవల స్థానికులు ఆయనను కలవడంతో అధికారులు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా అమర్నాథ రెడ్డి స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి ఆమోదంతోనే రోడ్డు విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారు.