చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి
KDP: గ్యాస్ స్టవ్ వద్ద ప్రమాదశాత్తు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడి పోరుమామిళ్ల మండలం దాసరపల్లెకు చెందిన నాగమ్మ(72) అనే వృద్ధురాలు ఆదివారం మృతి చెందారని ఎస్సై కొండారెడ్డి తెలిపారు. SI వివరాల మేరకు దాసరిపల్లెలో ఈనెల 29న వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై తెలిపారు.