కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ భర్త
MDK: మనోహరాబాద్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా నాయకులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మనోహరాబాద్ తాజా మాజీ ఎంపీపీ భర్త పురం రవి ఆయన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.