VIDEO: ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగింపు
BHNG: జిల్లా యాదగిరిగుట్ట బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఉదయం నుంచే డిపో వద్ద బైఠాయించి కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సమ్మె కార్మికులు పేర్కొన్నారు. సమ్మె కారణంగా బస్సుల రాకపోకలు ప్రభావితమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.