VIDEO: గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
ఏలూరు రైల్వే స్టేషన్లో కాకినాడ నుంచి చెన్నైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఏలూరు రైల్వే పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 17 లక్షల విలువైన 34.65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.